calender_icon.png 25 February, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్‌కు రూ. 5 కోట్లు మంజూరు

25-02-2025 12:29:46 AM

కేసీఆర్‌ఆర్ ఫాంహౌజ్ వీడి పెండింగ్ పనులు పూర్తి చేయాలి 

డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి 

 గజ్వేల్, ఫిబ్రవరి 24 : గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి  సీఎం రేవంత్ రెడ్డి రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేశారని  డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం తునికి ఖాల్సాలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన విలేకరులతో  మాట్లాడారు.  సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని  గజ్వేల్ నియో జకవర్గంలోని పలు సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, ఆయా శాఖా పరమైన పనుల ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్లు స్పష్టం చేశారు. 

గజ్వేల్  ఎమ్మెల్యే కెసిఆర్ ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు పొందుతున్నా నియోజక వర్గాన్ని, ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా ఆయన హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి ఫాంహౌజ్ వీడాల్సిన అవసరం ఉందన్నారు. గజ్వేల్‌లోని పెండింగ్ పను లను ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తే  నిధులు మంజూరయ్యే అవ కాశం ఉందని, మూడుసార్లు గెలిపించిన ఇక్కడి ప్రజల బాగోగులు దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ బయటకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, మండల పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, యూత్ అధ్యక్షులు పంజాల సాయి కిరణ్ గౌడ్, నాయకులు విద్యాకుమార్, శ్రీరాం నరసింహులు, శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, ఓంకార్, నందు, కొండగళ్ల గణేష్, భరత్ గౌడ్, బాబా, రామ్ రెడ్డి, బొడ్డు వెంకటేష్, గణేష్, రాజశేఖర్ రెడ్డి, మహేందర్ గౌడ్, కిషన్ గౌడ్ పాల్గొన్నారు.