calender_icon.png 22 April, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ కి స్థలం కేటాయించండి

21-04-2025 09:35:11 PM

వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లస్వామి

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి మండల పరిధిలో దాదాపు 2000 వడ్డెర కమ్యూనిటీ కుటుంబాలు గత 3దశాబ్దం కాలంగా నివాసం ఉంటూ రాళ్లు కొట్టుకొని బ్రతుకు వెళ్లదీస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు కావడం వల్ల కమ్యూనిటీ వాళ్ల శుభకార్యాలు,కమ్యూనిటీ వాళ్లకి ట్రైనింగ్ చేయించడానికి, గ్రంథాలయం ఏర్పాటు కోసం పది నుంచి 20 గుంటల ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 186 లో కేటాయించాలని ప్రజావాణి లో డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారికి వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లస్వామి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎల్లస్వామి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కమ్యూనిటీ అయిన వడ్డెర సంఘానికి 10 నుంచి 20 గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించడం వల్ల వడ్డెర కమ్యూనిటీ సంక్షేమానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, మధు, భాస్కర్, శివ, చంద్రశేఖర్,శేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.