calender_icon.png 11 January, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలిండియా సర్వీసుల్లోనూ అన్యాయమే

02-11-2024 12:36:39 AM

  1. తగ్గుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం
  2. దక్కాల్సిన వాటా 49.50 శాతం
  3. ఇస్తుంది 27.37 శాతం మాత్రమే
  4. గత నియామక జాబితాలతో స్పష్టం

హైదరాబాద్, నవంబర్ ౧ (విజయ క్రాంతి): సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదు. ఈ క్రమంలోనే ఆయా వర్గాల ప్రజల సాధికారత కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్ల రూపంలో కొన్ని వెసులుబాట్లు కల్పించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాం గం ద్వారా లభించిన రిజర్వేషన్లతో ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు అవకాశం లభిస్తుంది. రాజకీయ ప్రాతినిధ్యం, రాష్ట్ర పరిధిలోని ఉద్యోగ కల్పనలో అవకాశాలను పక్కన పెడితే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకం గా భావించే ఆలిండి యా సర్వీస్ ఉద్యోగా ల నియామకంలోనూ వీరికి తగినంత ప్రాతినిధ్యం లభించడం లేదు.

ముఖ్యంగా ఆలిండియా సర్వీసు ఉద్యోగాలైన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఉద్యోగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత తగ్గుతోంది.  

రాజ్యసభలో ఎంపీ ప్రశ్నకు సమాధానం...

గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ఎంపీ డా.జాన్ బ్రిట్టాస్ ఈ అంశాన్ని లేవనెత్తారు. గత ఐదేళ్లుగా చేపట్టిన ఆలిండియా సర్వీసు నియామకాల సం ఖ్య, అందులో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అ భ్యర్థులకు సంబంధించిన సంఖ్యపై ప్రశ్నించారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం రాత పూర్వక సమాధానం ఇచ్చింది. 2018-22 మధ్య కా లంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ ఉద్యోగాలకు ఎంపికైన వారి సంఖ్యను వెల్లడిం చింది. దీంతోపాటు అఖిల భారత సర్వీసులకు ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు సంబంధించిన వివరాలను కూడా తెలిపింది.

ప్రాతినిధ్యం సగమే...

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు నష్టపోతున్నారనే విషయం 2018 మధ్య చేపట్టిన నియామకాల నివేదికను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఆలిండియా సర్వీసుల్లో రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాస్తవంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదు.

ఈ నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం పోస్టులు దక్కాల్సి ఉండగా ఐదేళ్లలో సగటున వారికి 15.92 శాతం ప్రాతినిధ్యం మాత్రమే లభించింది. ఎస్సీలకు 15 శాతం శాతం వాటా రావాల్సి ఉండగా 7.65 శాతం పోస్టులు మాత్రమే దక్కాయి. ఎస్టీలకు 7.5 శాతం కోటా లభించాల్సి ఉంటే 3.8 శాతం మాత్రమే లభించింది.