calender_icon.png 18 March, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ లాగా తెలంగాణలో పొత్తులంటే కష్టం

18-03-2025 12:23:50 AM

బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): తెలంగాణలో జనసేన, టీడీపీతో జట్టు కడితే బీజేపీకి నష్టమే నని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బీజేఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అధిష్ఠానం తెలంగాణలో కూటమి ఆలోచన చేయొద్దనేది తన అభిప్రాయమన్నారు.

తెలంగాణలో ఇప్పటి కే బీజేపీ బలంగా ఉందని, సీమాంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బీఆర్‌ఎస్‌కు లబ్ధి జరిగే ప్రమాదం ఉందన్నారు. పాత ఇనుప సామాను పేరి ట రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై రాకే శ్ స్పందించారు. అంతర్గత వ్యవహారాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందన్నారు. ఈటల, అరవింద్,రామచందర్‌రావు, అరుణ, రఘునందన్‌లలో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడయ్యే అవకాశముందన్నారు.