12-02-2025 02:09:37 AM
కరీంనగర్, ఫిబ్రవరి 11(విజయక్రాంతి): ఈ రోజు ప్రకటించిన 2025 (ఫస్ట్ సెషన్) ఐఐటి జేఈ ఈ మెయిన్ ఫలితాల్లో అల్ఫో ర్స్ విద్యాసంస్థ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా నగరంలోని వావిలాలపల్లిలోని టైనీటాట్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్. వి నరేందర్ రెడ్డి, తమ విద్యార్థులు జేఈఈ మెయిన్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచా రని తెలిపారు.
ఈ పరీక్షలో అనిరుద్ సాయి 99.90 పర్సంటైల్, వమిక 99.88 పర్సంటైల్, ఈ. అంకిత్ సాయి 99.81 పర్సంటైల్, సాయి సు ముఖ 99.69పర్సంటైల్, విశాల్ 99.61ప ర్సంటైల్, రిషికేష్ 99.53పర్సంటైల్, రామ సుమిత్ 99.51పర్సంటైల్, అబ్దుల్ హక్ 99.48పర్సంటైల్, అబ్దుల్ జిషన్, 99.41 పర్సంటైల్, శశి ప్రీతం 99.38పర్సంటైల్, ఈ కార్తీక్ రెడ్డి 99.09 పర్సంటైల్, 99 ఆపై పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య 11, 98 ఆపై పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య 53తో అత్యుత్తమ ఫలితాలు సాధించి నట్లుగా పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ డాక్టర్.వి నరేందర్ రెడ్డి, కష్టపడి సాధించిన ఫలితాలు అందరికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. అల్ఫోర్స్ విద్యా సంస్థలలో విద్యార్థులకు అందించబడే ప్రత్యే క శిక్షణ, సీనియర్ అధ్యాపకుల మార్గదర్శక త్వం, అభ్యాసం ద్వారా మాత్రమే ఈ అద్భు త ఫలితాలు సాధించగలిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.