28-04-2025 04:25:45 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని నాశం చేసింది బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆరే అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కాళ్లేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని, కుంగిన కాళేశ్వరం గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని ఎన్డీఎస్ఏ నివేదిక చెప్తోందని, కేసీఆర్ చేసిన భారీ ఆర్థిక నేరాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందని మహేశ్వర్ రెడ్డి అడిగారు.
తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును ఎందుకు మార్చారో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని, మిషన్ భగీరథ నీళ్లు తాగేందుకు పనికిరావటం లేదని ప్రజలే అంటున్నారని, కేసీఆర్ చేసిన అప్పులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారాయని విమర్శించారు. ధరణి పోర్టల్ తెచ్చి వేల ఎకరాలను కబ్జాలు చేశారని, ధరణి పోర్టల్ అక్రమాలపై కేసీఆర్ వరంగల్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఎందుకు మాట్లాడలేదని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.