calender_icon.png 1 November, 2024 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు ఏ శాఖపై కూడా పట్టులేదు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

15-07-2024 06:16:07 PM

హైదరాబాద్ : బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోందన్నారు. గ్రామ సర్పంచ్ లు, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం బిల్లులు ఇవ్వడం లేదని మహేశ్వర్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ శాఖపై కూడా పట్లులేదన్నారు. మంత్రులు ఎప్పుడైనా గ్రామాలకు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారా? అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.