- 500 మందికి ఉద్యోగ అవకాశాలు
- ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 15 (విజయ క్రాంతి) : ఆటోమోటివ్, విద్యుత్తు వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెటిక్, సెన్సార్లు, చిప్‌ల తయారీలో దిగ్గజ సంస్థ అయిన అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్‌లో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
శుక్రవారం సచివాలయంలో అల్లెగ్రో కంపెనీ ప్రతినిధులతో మంత్రి ఒప్పందం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అల్లెగ్రో పరి శోధనా కేంద్రం ఏర్పాటుతో 500 మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అభివృద్ధి, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
అల్లెగ్రో రాకతో రాష్ట్రంలో సెమీ కండక్టర్ చిప్‌ల తయారీ పరిశ్రమకు ఊతం లభిస్తుందన్నారు. విద్యుత్తు వాహనాల సిగ్నల్ డిజైన్, వెరిఫికేషన్, వ్యాలిడేషన్తోపాటు రోబోటిక్ ఆటోమేషన్‌లో కూడా అల్లెగ్రా చిప్‌లను రూపొందిస్తుందని వెల్లడించారు.
బీఎండబ్ల్యూ విద్యుత్తు కార్ల తయారీ సంస్థతో పాటు ఈవీ రంగంలో బ్యాటరీల నిర్వహణ, పవర్ చిప్‌ల తయారీలో ఈ అల్లెగ్రా సంస్థ అగ్రగామిగా ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ సీఈవో వినీత్ నర్గోల్వాలా, సీనియర్ వీపీ సుమన్ నారాయణ్, మరో సీనియర్ వీపీ మ్యాక్స్ గ్లోవర్ పాల్గొన్నారు.