calender_icon.png 3 April, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలీజియన్స్ గ్రూప్ 2వేల కోట్ల పెట్టుబడులు

21-03-2025 12:39:55 AM

  1. ‘ఫ్యూచర్ సిటీ’లో భాగంగా తైవాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
  2. తైవాన్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందం
  3. 11 కంపెనీలతో ఎంఓయూలపై సంతకం

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ‘ఫ్యూచర్ సిటీ’లో తన మొదటి ఇం టర్నేషనల్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ (ఐటీఐపీ)ను ఏర్పాటు చేసేందుకు తైవాన్‌కు చెందిన ఎలీజియన్స్ గ్రూప్(తైవాన్‌కు చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల స మూహం) తెలంగాణ ప్రభుత్వంతో గురువా రం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వ ల్ల రానున్న మూడేళ్లలో రూ. 2000 కోట్ల పెట్టబడులతో పాటు లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగనుంది.

ఈ ఒప్పందంతో తైవాన్-- ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతమవనున్నట్టు ఇరు వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర బృందం తైవాన్ రాజధాని తైపీ లో పర్యటిస్తోంది. ఎలీజియన్స్ గ్రూప్‌తో జరిగిన చర్చలో భాగంగా మొత్తం 11 కంపెనీలతో రాష్ట్ర బృందం ఎంఓయూలపై సంత కం చేశాయి.

ఈ కార్యక్రమానికి భారతదేశం లో తైవాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీసీసీఐఎన్) అధ్యక్షుడు హో చున్-హ్సిన్, తెలంగాణ ప్రభుత్వం నుంచి సీనియర్ అధికారులు, ఇండియా తైపీ అసోసియేషన్ (ఐటీఏ) డైరెక్టర్ జనరల్ మనర్‌సిన్ యాదవ్ హాజర య్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐటీఐపీకి కొంగరకలాన్‌లోని ఎలక్ట్రానిక్ పార్కులో 15 ఎకరాలను అప్పగించింది. మరో 250 ఎకరాలను అప్పగించాలని తైవాన్ కంపెనీలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.