calender_icon.png 29 April, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలపై ఆరోపణలు సరికావు

28-04-2025 01:43:47 AM

  1. శ్రీ లక్ష్మీగణపతి ఆలయాభివృద్ధికే వ్యాపార సముదాయం 

ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే నిరూపించాలి

ఆలయ కమిటీ ప్రతినిధుల బృందం స్పష్టీకరణ 

ఎల్బీనగర్, ఏప్రిల్ 27  : వనస్థలిపురంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీలక్ష్మీగణపతి దేవాలయ అభివృద్ధి కోసమే వ్యాపార సముదాయం ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది.  ఆదివారం దేవాలయ సముదాయ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఆలయ కమిటీ చైర్మన్ బుద్దోలు అశోక్ కుమార్ గౌడ్, శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య, రామాలయ చైర్మన్ లక్ష్మణరావు, వైస్ చైర్మన్ మిట్టా రామ్మోహన్, వైస్ చైర్మన్ కంచి కృష్ణ మోహన్, వైస్ చైర్మన్ డాక్టర్ ఉప్పల ప్రభాకర్, జనరల్ సెక్రెటరి తుమృగోటి లక్ష్మారావు, ట్రెజరర్ లగిశెట్టి బాలేశ్వర్, జాయింట్ సెక్రటరి వట్టం సురేశ్, జాయింట్ ట్రెజరర్, దొంతుల అశోక్ కుమార్ తదితరలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వనస్థలిపురంలోని శ్రీ లక్ష్మీగణపతి దేవాలయ అభివృద్ధికి 40 సంవత్సరాలుగా నిరంతర కృషి కొనసాగుతుందన్నారు. వారం రోజులుగా దేవాలయ వాణిజ్యసముదాయంపై కొందరు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న తీరు, వారి అనాలోచిత ఆలోచన విధానానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు రాజకీయ కుట్రలో భాగంగా లక్ష్మీగణపతి దేవాలయ అభివృద్ధిని, ఆలయ కీర్తిని అపహస్యం చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.

దేవాలయంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి, దాతలు ఇచ్చే విరాళాలు, వస్తు సామగ్రి, హుండీ ఆదాయం, ఖర్చులు, పూజార్ల జీతభత్యాలు, సిబ్బంది జీతభత్యాలు, దేవుళ్ల దీప దూప నైవేద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విధాల ఆదాయ వనరులకు సంబంధించి ప్రతి రూపాయికి ఖచ్చితమైన లెక్క ఉందని స్పష్టం చేశారు. 1983 నుంచి నేటివరకు ఆలయాభివృద్ధిలో కాలనీవాసులతోపాటు ఆలయ కమిటీల పాత్ర ఎంతో గొప్పది అన్నారు.

ఖర్చులు పెరిగిపోవడంతో ఆదాయ వనరుల కోసం వ్యాపార వాణిజ్య సముదాయాల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.  అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తులు ముందుకొచ్చి నిరూపించాలని కమిటీ ప్రతినిధుల బృందం సవాల్ విసిరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాల్సిన వ్యక్తులు అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.