calender_icon.png 23 March, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఆరోపణలు సరికాదు

22-03-2025 05:43:17 PM

పాత కాంగ్రెస్ క్యాడర్ ను కలుపుకొని పనిచేస్తాం

అనారోగ్యంతోనే కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త మృతి

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు

బాన్సువాడ,(విజయక్రాంతి): పాత కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను విస్మరించడం లేదని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు(Agro Industries Corporation Chairman Kasula Balaraju) అన్నారు. శనివారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ లో చేరారు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. కేవలం ఎన్నికల ముందు ఎల్లారెడ్డి లో టికెట్ రాక బాన్సువాడ కు వచ్చి పోటీ చేసిన రవీందర్ రెడ్డి పాత క్యాడర్ కొత్త క్యాడర్ మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

తాను పాత క్యాడర్ మనిషిని గనుక ఏలాంటి ఇబ్బందులు ఎదురైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తనకు చెప్పవచ్చని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారందరినీ కలుపుక పోవడానికి తాను ఎప్పుడు సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్పూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎగ్బాల్ గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో ఉండి చనిపోయారని ఆయన మరణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కారణమని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు.

పాత క్యాడర్ కి ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తేవచ్చు అని కలుపుకొని పనిచేసి కాంగ్రెస్ పార్టీ నీ ముందుకు తీసుక వెళ్దామని  అన్నారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తాను ఎమ్మెల్యే కోసం పోటీ చేసి ఓటమిపాలైన విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వకపో పోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా రవీందర్ రెడ్డి కి మద్దతుగా పనిచేశామని తెలిపారు. అందుకే తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే నాయకులకు గుర్తింపు తప్పక ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నార్ల సురేష్, కాలిక్ బాయ్, ఎజాజ్, ఆఫ్రోజ్, సాయిలు, అజీమ్,  కార్యకర్తలు పాల్గొన్నారు.