కూకట్‌పల్లి, సెప్టెంబర్ 2: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అల్లాపూర్ డివిజన్ అతలాతకులమైంది. డివిజన్‌లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి వదర చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సఫ్దర్ నగర్, రాజీవ్‌గాంధీ నగర్‌లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇళ్లలో నిలిచిన వరద నీటిని స్థానికులు మోటార్ల సాయంతో తోడెస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు జేసీబీ సాయంతో వర్షపు నీటిని మళ్లిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. అధికారులు వెంటనే కాలనీల్లో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపించాలన్నారు.