09-03-2025 12:28:06 PM
చిట్యాల మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్
చిట్యాల,(విజయక్రాంతి): రైతులు వేసిన పంట పొలాలకు నీళ్లను అందించి ఆదుకోవాలని చిట్యాల మాజీ జెడ్పీటీసీ గొర్రసాగర్(Chityala Former ZPTC Gorre Sagar) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చలివాగు ఆయకట్టు కింద ఎండిపోతున్న పొలాలను బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్ గారు మాట్లాడుతూ.. ప్రభుత్వం సాగు నీరు ఇస్తుందనే ఆశ తో సాగుచేసిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో వారం రోజుల్లో నీళ్ళు రాకపోతే పచ్చని మాగాణి ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.
ఇప్పటికే రైతులు దిక్కు తోచని స్థితిలో అల్లాడిపోతున్నారని, వారికి నీటిని అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు,మండల ప్రధాన కార్యదర్శి ఎరుకొండ రాజేందర్, గ్రామ శాఖ అద్యక్షుడు కోడారి రవి, మాజీ సర్పంచ్లు పుట్టపాక మహేందర్, బైరం భద్రయ్య, మాజీ ఎంపీటీసీ లు జంబుల తిరుపతి, జంబుల చంద్రమొగిలి, నాయకులు పాండ్రాల వీరాస్వామి, చేరి రవీందర్, దామెర రాజు, గుర్రం మహేందర్, చాడ ఆనంద్ రెడ్డి, స్వామి దాస్, అవంచ రమేష్ రాజేందర్, కుమార్, ఎలగొండ తిరుపతి, మేకల సాంబయ్య, మర్రి నరేష్, భాస్కర్, సంపత్ రావు, రవి, సదయ్య, ఓదెలు, రైతులు పాల్గొన్నారు.