calender_icon.png 16 April, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె ఆపదను కొనితెచ్చుకుంది

15-04-2025 11:55:48 PM

మైనర్‌పై అత్యాచారం కేసులో మరోసారి..

సంచలన వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ కోర్టు..

వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు..

న్యూఢిల్లీ: సంచలన తీర్పులతో వార్తల్లో నిలుస్తోన్న అలహాబాద్ హైకోర్టు.. తాజాగా మరో కేసులో సంచలన వ్యాఖ్యలు చేసింది. మార్చి 17న ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో యువతి వక్షోజాలను తాకడం, పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకి రావని జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహా మరో కేసులో.. అత్యాచార ఘటన యువతిదే స్వయంకృతాపరాధమంటూ వ్యాఖ్యానించింది. దీంతో సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తుల వ్యాఖ్యలను తప్పబట్టింది.

ఈ తరహా తీర్పులతో సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పులో భాగంగా బెయిల్ ఇవ్వొచ్చు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? అని ప్రశ్నించింది. తీర్పులు ఇచ్చే సమయంలో చేసే వ్యాఖ్యల విషయంలో జడ్జీలు జాగ్రత్తలు తీసుకోవాంటూ మొట్టికాయలు వేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ‘న్యాయం చేయడమే కాదు, దాని గురించి అందరూ మాట్లాడుకునేలా ఉండాలి’ అంటూ పేర్కొన్నారు. కాగా తీర్పును సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.