మునుగోడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇరుగు రవి...
మునుగోడు (విజయక్రాంతి): కులమత బేధాలు లేకుండా యువకులందరూ క్రీడల్లో రాణించాలని మునుగోడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇరుగు రవి అన్నారు. సోమవారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి క్రీడోత్సవాలలో భాగంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామితో కలిసి క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. యువకులలో ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికి డివైఎఫ్ఐ మంచి ప్రయత్నం చేస్తుందని కొనియాడారు. క్రీడల వల్ల యువకులలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని, యువత చెడు వ్యసనాలకు, గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్, మద్యంకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గెలుపు ఓటములను ప్రతి క్రీడాకారుడు సమానంగా స్వీకరించాలని, దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉందని అన్నారు.
అంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ.. ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటున్న యువతీ యువకులకు స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, ప్రజాసంఘాల నాయకులు పగిళ్ల మధు, వరికుప్పల ముత్యాలు, నారబోయిన నరసింహ, బొందు అంజయ్య, అయితగోని యాదయ్య, పగిళ్ల పరమేష్, పగిళ్ల యాదయ్య, బొందు ముత్యాలు, కట్ట మారయ్య, డివైఎఫ్ఐ నాయకులు కట్ట ఆంజనేయులు, కట్ట లింగస్వామి, కట్ట వెంకన్న, వనం సంపత్, కుక్కల బాలస్వామి, కుక్కల మహేష్, చేకూరి ప్రేమ్ సాగర్, కుక్కల కార్తీక్, పగిళ్ల సాయి తేజ, బయ్యా మహేష్, భయ్య సురేష్, సింగపంగా నరేష్, దినేష్, బొందు రాజు, మాదరగొని కిషోర్, అరవింద్ రెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు.