01-04-2025 06:34:03 PM
భైంసా (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం అభినందనీయమని అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇతర సంక్షేమ పథకాలను పేదలకు అందించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసా పట్టణంలోని అనసూయ పవార్ నగర్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్నీ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బి నారాయణరావు పటేల్ తో కలిసి ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లబ్ది దారులకు తులం బంగారం పంపిణీ చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల పెన్నిధి అని దశరవారీగా ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అన్నారు. మిగతా వాటిని నెరవేర్చేందుకు సంసిద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. మార్కెట్ చైర్మన్ అనంతరావు పటేల్ అధికారులు పాల్గొన్నారు.