calender_icon.png 17 April, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసంఘటితరంగ కార్మికులందరూ ఈ శ్రమ్ కార్డు కలిగి ఉండాలి

08-04-2025 05:57:35 PM

సహాయ కార్మిక శాఖ అధికారి మహమ్మద్ ఇబ్రహీం జుబేర్..

బాన్సువాడ (విజయక్రాంతి): మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలో బాన్సువాడ కార్మిక శాఖ సహాయ అధికారి మహమ్మద్ ఇబ్రహీం జుబేర్ అసంఘటితరంగా కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఈ శ్రమ కార్డు, లేబర్ కార్డు గురించి అవగాహన కల్పించారు. కార్మికులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసంఘటిత రంగంలో పనిచేస్తున్న శ్రామికులందరూ ఈ శ్రమ్ కార్డు సిఎస్ సి సెంటర్లలో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ శ్రమ్ కార్డు గురించి అవగాహన కల్పించారు.

ఈ కార్డు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయల ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని, శాశ్వత అంగవైకల్యంకు ఆర్థిక సహాయం అందుతుందని ఆయన తెలిపారు. అనంతరం భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ లేబర్ కార్డు చేసుకోవాలని లేబర్ కార్డు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్ షేక్ దావూద్, కార్మిక సంఘం నాయకులు దుబాస్ రాములు, కార్మికులు శివాజీ, భూమయ్య, మొగులయ్య, పుట్టి సాయిలు, రాపర్తి సాయిలు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.