13-03-2025 12:19:56 AM
కొందరి ఆర్‌ఎంపీల ఇష్టారాజ్యం
అర్హతకు మించి వైద్యంతో అందిన కాడికి దండుకోవడం
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్‌ఎంపీఎల్, పీఎంపీలు
కాసులకు కక్కుర్తిపడి ఇష్టానుసారంగా అబార్షన్లు?
వైద్య ఆరోగ్యశాఖ నిఘా కరువు
పెబ్బేరు, మార్చి 12: వైద్యో నారాయణో హరి అంటారు... వైద్యుడిని దేవునితో పోలుస్తారు... అలాంటి వైద్య వృత్తికి కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు మచ్చ తెస్తున్నారనే ఆరోపణలు బహిరంగా వినిపిస్తున్నాయి. ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్‌ఎంపీలు కొందరు డాక్టర్ అవతారం ఎత్తి ప్రజల అవసరమైన ఆసరా చేసుకుని అడ్డంగా దోచుకుంటున్నారు. అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇస్తారాజ్యంగా క్లినిక్లను నిర్వహిస్తున్నారు. పరిధిని మించి వైద్యం చేస్తున్న కొందరి వల్ల నిజాయితీతో ప్రాథమిక వైద్యం చేసే వాళ్లకు ఇబ్బంది వస్తుంది. పెబ్బేరు మండలంలో సుమారుగా 75 మంది పైగా ఆర్‌ఎంపీలు ఉన్నారు. ఇందులో కొందరు ఇంటికి వెళ్లి చికిత్స అందిస్తే మరికొందరు మాత్రం క్లినిక్లు ఏర్పాటు చేసుకుని చికిత్సలు అందిస్తున్నారు.
మరికొందరైతే తాండాలు చుట్టుప క్కల గ్రామాలకు వెళ్లి ప్రజలకు చికిత్సలు అందిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. జ్వరం వస్తే మాత్రలు మాత్రమే ఇవ్వాలి. రోగి పరిస్థితి మరి బాగా లేకపోతే దగ్గర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని సూచించాలి. ఆసుపత్రికే రోగిని తరలించే లోగా పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రాథమిక వైద్యం నిబంధనలోబడి చేయాలి. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్ లకు ఎలాంటి పేరు పెట్టుకోకూడదు. తన పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోవడానికి వీల్లేదు కట్లు కట్టడం, స్లున్లు ఎక్కించడం, ఇంజక్షన్లు వేయడం వంటివి చేయకూడదు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు చికిత్స అందించకూడదు. వీటన్నిటికీ విరుద్ధంగా అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డంగా దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆర్‌ఎంపీ వైద్యుల తీరు....
పెబ్బేరు మున్సిపాలిటీతో పాటు మండలంలో నకిలీ వైద్యుల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. మొలలకు చికిత్సలో జ్వరాలకు మందులు గ్లూకోజ్ లో ఇంజక్షన్లను ఇస్తూ సమస్తము పూర్తిస్థాయి వైద్యుల్ల అవతారం ఎత్తుతారు. అవగాహన లేకుండా ఇబ్బడిముబ్బడిగా నోటికొచ్చిన మందులు యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ రాసి అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. అవి వాడిన రోగులకు కొత్త రోగాలు రావడం కిడ్నీలు దెబ్బ తినడమే కాకుండా ఒక్కోసారి ప్రాణా లు సైతం పోతుంటాయ. మరికొందరు ఆర్‌ఎంపి మంత్రాలు తంత్రాలు తాయతలం టూ ప్రజలను మాయ చేస్తున్నారు.
కాసుల కోసం...
గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేసుకుందామని చాలామంది ఆర్‌ఎంపీల దగ్గరకు వెళ్ళిపోతున్నారు. ప్రసవాలు, అబార్షన్లను ఆసరాగా చేసుకుని ఆర్‌ఎంపీలుగా చలామణి అవుతున్న కొందరు కాసులు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబార్షన్ చేసుకునే వారిని ఓ ప్రైవేట్ స్థలానికి రప్పించుకుంటున్నారు. ముందుగానే రేట్లు ఫిక్స్ చేసే ఇష్టానుసారంగా అబార్షన్లు చేస్తున్నారు. కొందరైతే చేతికి మట్టి అంటకుండా రోగులను కర్నూల్ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి అబార్షన్లు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. గర్భం నెలలు పెరిగే కొద్దీ అందుకు తగ్గట్టు ఫీజు డిమాండ్ చేస్తున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని రూ.10వేల నుంచి రూ.40వేల వరకు డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనధికారిక వ్యక్తుల వద్ద అబార్షన్లు చేసుకోవడంతో పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
డాక్టర్ల చీటీ లేకుండా...
పెబ్బేర్ లో పలు మందుల దుకాణాల్లో డాక్టర్ల చీటీ లేకుండా మందులు మాత్రలు విక్రయిస్తున్నారు. నిబంధన ప్రకారం గుర్తిం పు పొందిన డాక్టర్ల అనుమతితోనే మం దులు అమ్మాలి. అలా కాదని కొందరు మం దుల దుకాణదారులు విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ముఖ్యంగా అబార్షన్ల మా త్రలను కూడా డాక్టర్ అనుమతి లేకుండా ఇచ్చేస్తున్నారు. ఆర్‌ఎంపీలు చీటీ పై రాసి ఇచ్చే మాత్రలు కూడా అంటగడుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
పెబ్బేరు మండలంలో ఎక్కువగా చిన్న పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు, అబార్షన్లు, గొడవలో గాయపడిన వారికి చికిత్స చేస్తున్నారనే సమాచారం మా దృష్టికి వచ్చింది. గత కొన్ని రోజుల క్రితం సుగూరు గ్రామానికి చెందిన ఒక బాలు డు అల్లరి చేస్తున్నాడని తల్లి, తండ్రి తిట్టి, కొట్టి, తొడ భాగంలో వాతలు పెట్టిన విషయంలో ఒక ఆర్‌ఎంపీ చికిత్స అందించడం జరిగింది. మెడికో లీగల్ కేసులు వచ్చినప్పుడు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నిబంధనలు ఉల్లంగించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.
- ఎస్సై హరిప్రసాద్ రెడ్డి, పెబ్బేరు.