calender_icon.png 20 April, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదంతా రాహుల్, సోనియా మెప్పు కోసమే!

10-04-2025 02:26:24 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రాహుల్ గాంధీ, సోనియా గాంధీని మెప్పించేందుకు సీఎం రేవంత్ బీజేపీని విమర్శి స్తున్నారని, తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమంటూ మాట్లాడుతున్నారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు.

అయితే ఇప్పటికే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలతో తెలంగాణలో సత్తా చాటినట్టు పేర్కొ న్నారు. బుధవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజ లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.

బీజేపీ,- కాంగ్రె స్ కలిసి హైదరాబాద్‌లో చేసిన భూ కుంభకోణాలపై నిజాలు బయటపెడతానని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. వాస్తవానికి భూ కుం భకోణాల వెనుక ఉన్నది బీఆర్‌ఎస్,- కాంగ్రెస్ అని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, తాము అధికారంలోకి వచ్చాక ఆ డబ్బును రికవరీ చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మౌనంగా వ్యవహరించడం చూస్తే రాజకీయంగా కుమ్మక్కైనట్టుగా అనిపిస్తోందని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అదే పరిస్థితి అని అన్నారు.

హెచ్‌సీయూ భూముల విషయంలోనూ ఇదే కుతంత్రం నడుస్తోందన్నారు. గతంలో బీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు విలువైన భూములను అమ్ముకుంటున్నాయని విమర్శించారు.