calender_icon.png 21 January, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దారంతా బండారి వనమె మల్లన్న

21-01-2025 12:00:00 AM

మా తోడు నువ్వు ఉండిపో మల్లన్న 

చేర్యాల, జనవరి 20:  నిన్న,మొన్న మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ ఆలయాలు జనసంద్రంగా మారగా, సోమవారం రోజు ఆ సీను తోట బావికి మారింది. తోట బావి ప్రాంతం శివసత్తులు, భక్తులతో కిటకిటలాడింది. తోట బావి ప్రాంతం మొత్తం బండారి వనంను తలపించింది. ఎటు చూసినా పసుపు వర్ణమే కనిపించింది. గ్రౌండ్ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది.

సోమవారం ఉదయమే తోటబావి ప్రాంతంలో హైదరాబాద్ కు చెందిన యాదవులు, ఒగ్గు కళాకారులు అగ్ని గుండాలు, పట్నం సంబంధించిన ఏర్పాట్లను చూశారు. ఒగ్గు కళాకారులు పంచవర్ణాలతో పెద్దపట్నాని రచించగా, యాదవులు మిగతా సిబ్బంది ఐదు రకాల కర్రలను కుప్పగా చేర్చి, నిప్పు కనికలను తయారు చేశారు. అనంతరం గర్భగుడి నుండి మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతమ్మ ఉత్సవమూర్తులను ఆలయ అర్చకులు అగ్నిగుండాలను పెద్దపట్నాన్ని దాటించారు.

ఆ తర్వాత శివసత్తులు, భక్తులు పూనకాలతో ఊగుతూ, శివ నామ స్మరణ చేసుకుంటూ, భక్తి పరవశంతో అగ్నిగుండాలను, పట్నాన్ని దాటారు. పట్నాన్ని దాటిన భక్తులు సరాసరి గా గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నాను.

అంతకుముందు పెద్దపట్నం అగ్నిగుండాల తయారు చేసే వరకు భక్తులు ఓపిగ్గా ఉంటూ, బతుకమ్మ, కోలాటాడులాడుతూ మల్లన్న నామస్మరణ చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వాక అధికారి రామాంజనేయులుతో పాటు పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు.