calender_icon.png 24 January, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంటు భూమి లేని పేదలందరినీ అర్హులుగా గుర్తించాలి

24-01-2025 12:00:00 AM

రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, జనవరి 23 ( విజయక్రాంతి ) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా  పథకంలో సెంటు భూమి లేని పేదలందరిని  అర్హులుగా గుర్తించాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. గురువారం మధ్యాహ్నం పాన్గల్ మండలం గ్రామ సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనన్న నాలుగు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లాబ్ధిదారునికి అందాలని సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పై అధికారులతో మాట్లాడుతూ కొంతమంది కూలీలు ఎక్కువ కూలీ వస్తుందని ఉపాధి హామీ పనిలో కాకుండా బయట పనికి పోవచ్చని అంతమాత్రాన వారిని అనర్హులుగా చెప్పలేమని చెప్పారు.

అందువల్ల ఉపాధి హామీలో కూలీ, జాబ్ కార్డుకు సంబంధం లేకుండా సెంటు భూమి లేని కూలీ లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా గుర్తించాలని ఆదేశించారు.  బయట ఎవరో చెప్పే మాటలు, దుష్ప్రచారాలను నమ్మవద్దని,  ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మంజూరు చేయడం జరుగుతుందనీ తెలియజేశారు. అనంతరం 61 మంది  కళ్యాణ లక్ష్మి, 2 శాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఆర్డీఓ సుబ్రమణ్యం, ప్రత్యేక అధికారి ఉమాదేవి, తహసిల్దార్, ఎంపీడిఓ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు .