17-02-2025 06:41:54 PM
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్..
మల్లన్న స్వామి దర్శించుకున్న తాడేపు వెంగల్ రావు..
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం కాసానపల్లి గ్రామంలో మల్లన్న గుట్ట పై వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి వందల సంవత్సరాల నుండి ప్రజలు పూజలు నిర్వహిస్తూ కోరిన వారికి కొంగుబంగారంగా వెలిసినాడని గ్రామస్తులు తెలిపారు. స్థల పురాణం తెలుపుతున్నది, గుట్టపై వెలిసిన మల్లన్న స్వామికి ప్రతి సంవత్సరం మాగా మాసంలో జాతర ఉత్సవాలు అతి వైభవంగా కొనసాగుతాయి. యాదవులు ఎనిమిది రోజుల పాటు ఉపవాసాలు పరిశుభ్రంగా ఉంటూ స్వామివారికి బోనాలు, బండ్లు, అంగరంగ వైభవంగా ఈ పండుగను నిర్వహిస్తారని, ఈ సంవత్సరం మల్లన్న స్వామినీ దర్శించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, వెంగల్ రావు సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వీరికి యాదవ సంఘం పెద్దమనుషులు, భక్తులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మల్లన్న స్వామికి పూజ నిర్వహించి మండల ప్రజలందరూ మల్లన్న స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు విరిగి శాల్వతో సన్మానం చేశారు, ఈ కార్యక్రమంలో మొజామిల్, సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్ గౌడ్, పబ్బ నాగేష్ గుప్తా, బాసరాజు, మాధవ్ రెడ్డి, జగన్ గౌడ్, మాజీ సర్పంచ్ స్వామి శామాల, నర్సిమా రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, దామోదర్ రెడ్డి, యాదవ్ సంఘo అధ్యక్షులు కావేటి స్వామి, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.