calender_icon.png 2 November, 2024 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు

12-05-2024 02:18:16 AM

మంత్రి సీతక్క

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 11 (విజయక్రాంతి): దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీజే పీ పాలనపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, దేశ సంపదనంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీరా శ్యామ్‌నాయక్, నాయకులు జీ మల్లేశ్, చరణ్, గుండ శ్యామ్, ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.