కల్యాణ తిలకం, నుదుట బాసికం, చెవులకు అందమైన జుంకాలు, మెడలో బంగారు ఆభరణాలు, ముచ్చటైన చీరకు ఎంబ్రాయిడరీ జాకెట్, నడుముకి వడ్డాణం, కాళ్లకు వెండి పట్టీలు, పాదాలకు పారాణి.. ఇదీ అచ్చమైన పెళ్లికూతురి ఆహార్యం. చూడగానే ఎంత బాగుందో అనిపించేంత అందంగా తయారవుతుంది వధువు. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించే కాంతి, కళకు ఏదీ సాటిరాదు. అసలే పెళ్లిళ్ల సీజన్.. ఇప్పుడు సందడంతా పెళ్లికూతుళ్లదే! వధువు ఎక్కువ ఆభరణాలతో.. మల్టిఫుల్ నెక్లెస్‌లతో మనోహరంగా కనిపిస్తుంది.. వేర్వేరు పొడవులున్న డైమండ్ నెక్లెస్‌లు, హారాలు చక్కగా పెయిర్ అప్ చేస్తే ప్రత్యేకమైన స్టుల్‌తో హుందాగా మెరిసిపోతారు.. పెళ్లిలో అందరిదృష్టిని ఆకట్టుకోవాలంటే మల్టిఫుల్ నెక్లెస్‌లు ధరించాల్సిందే! మరెందుకు ఆలస్యం మీరు ఓసారి ట్రై చేసి చూడండి!