calender_icon.png 23 February, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోకస్ అంతా తమిళ చిత్రాలపైనే..

22-02-2025 01:26:00 AM

హీరోయిన్ పూజా హెగ్డేకు స్టార్‌డమ్ కల్పించింది టాలీవుడ్డే అయినా కూడా ఎందుకో ఇటు వైపే చూడటం లేదు. అవకాశాలు రావడం లేదో.. అమ్మడే వద్దనుకుంటోందో తెలియదు కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడ్డాక టాలీవుడ్‌కి దూరంగానే ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా తమిళం పైనే. అక్కడ స్టార్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ జత కడుతోంది. సూర్య సుబ్బరాజు కాంబోలో వస్తున్న ‘రెట్రో’తో పాటు ‘జననాయగన్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ‘జననాయగన్’లో ప్రధాన పాత్రలో పూజా నటిస్తోంది. రాఘవ లారెన్స్‌తో కలిసి ‘కాంచన 4’ చేస్తోంది. అలాగే రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కూలీ’ చిత్రంలోనూ ఒక స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయనుందని టాక్. ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్.  మరోవైపు బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. మొత్తానికి పొడుగు కాళ్ల సుందరి చాలా గ్యాప్ తర్వాత తిరిగి బాగా బిజీ అయిపోయింది. ఈ చిత్రాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయంటే.. తిరిగి పూజాకు కోల్పోయిన స్టార్‌డమ్ తిరిగి రావడం ఖాయమని అంతా భావిస్తున్నారు.