14-04-2025 01:19:40 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 13 ( విజయక్రాంతి): నల్లమల అటవీ ప్రాంతమంతా లిం గమయ్య నామస్మరణతో మార్మోగుతోంది. ఈనెల 11నుండి ప్రారంభమైన సలేశ్వరం జాతరకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు దినాలు రావడంతో లక్షలాది భక్తజ నం పోటెత్తారు. హైదరాబాద్, రంగారెడ్డి ప్రధాన నగరాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు సలేశ్వరం జాతరకు బారు లు తీరారు.
దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతరకు సుమారు అచ్చంపేట నుండి మన్ననూర్ అమరాబాద్ లింగాల మండలాల పరిసరాల్లో ఎటు చూ సినా భారీ వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసి ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు ఆదివా రం ఒక్కరోజే లక్ష యాభై వేలకు మంది పైగా భక్తులు లింగమయ్యను దర్శించుకోవడానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయడంలో మాత్రం ఆయా శాఖల అధికారులు విఫలమయ్యారని భక్తులు మండిపడుతున్నారు.
ఒక్కో వాహనానికి పార్కింగ్ పేరుతో టువీలర్ వంద, త్రీవీలర్ 300, ఫోర్ వీలర్ 400 చొప్పున కోట్ల రూపాయలు దండుకుంటున్నారని కనీసం గుక్కెడు తాగునీరు కూడా సౌకర్యం కల్పించలేదని భక్తులు మండిపడుతున్నారు. అత్యంత సాహసోపేతమైన ఈ యాత్రకు చిన్న వయసు వారితో పాటు వృ ద్ధులు కూడా సలేశ్వరం జాతరకు పోటెత్తారు.
మన్ననూర్ చెక్ పోస్ట్ వద్దనే వాటర్ బాటిల్స్ తీసుకు వెళ్లొద్దంటూ అటవీశాఖ అధికారులు కట్టుదిట్టం చేసినప్పటికీ ఫరహాబాద్ నుండి సలేశ్వరం జాతర కాలినడక ప్రదేశం వరకు ఒక్కో వాటర్ బాటిల్ మీద అదనంగా 30 నుంచి 50 వరకు వసూలు చేస్తూ భక్తుల నుండి భారీగా దోపిడీకి తెగబడుతున్నారు. సోడా లెమన్, బత్తాయి జ్యూస్ ఇతర చిరుతలకు సైతం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ సంరక్షణ కోసం అనేక కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసామని గొప్పగా చెప్పుకుంటున్న అటవీశాఖ అధికారుల ముందే అధిక ధరలకు సిగరెట్లు కూడా అమ్ముతున్న పరిస్థితి. కేవలం దాతలు ఇతర భక్త బృందం అన్నదానం ఇతర పండ్ల దానం మీదే ఆధారపడి భక్తులు తమ కడుపు నింపుకుంటున్నారని ఆయా శాఖల అధికారులు మాత్రం మంచినీరు కూడా వసతులు ఏర్పాటు చేయలేదని భక్తులు మండిపడుతున్నారు. అత్యవసర వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోవ డంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి.