calender_icon.png 3 April, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

21-03-2025 12:31:02 AM

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): తెలంగాణలో నేటి నుం చి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఆత్మ విశ్వాసం, పట్టుదల, నిరంతరం శ్రమ.. అనేవి విజయతీరాలకు చేర్చే ఆయుధాలన్నారు.

ప్రతి ఒక్కరికి ప దో తరగతి పరీక్షలు చాలా ముఖ్యమని, అనవసర ఒత్తిడిని కొనితెచ్చు కోవద్దని సూచించారు. ప్రశాంతంగా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాల ను సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.