calender_icon.png 29 March, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ క్లాస్ పిల్లలకు ఆల్ ద బెస్ట్ : కలెక్టర్

21-03-2025 12:00:00 AM

కాటారం (భూపాలపల్లి), మా ర్చి 20 (విజయక్రాంతి) : ఈనెల 21 వ తేదీ శుక్రవారం నుండి  10 వ తరగతి వార్షిక పరీక్షలు ప్రా రంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు వ్రాయావిద్యార్థులు సంవత్సర కాలం పాటు ఉపాధ్యాయుల శిక్షణలో  ఎంతో శ్రమించి, పట్టుదలతో ఈ దశకు చేరుకుని పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారని తెలిపారు.

ప్రశాంతమైన  మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సా ధిస్తారని సూచించారు. విద్యార్ధి భవిష్యత్తుకు ఇదొక ముఖ్యమైన అడుగు అని, ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత  సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏ ర్పాట్లు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు  తగిన చర్యలు తీసుకున్నామని కలెక్టర్  తెలిపారు.

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సా ధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 21 వ తేది నుండి వచ్చేనెల 4 వ తేది వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 3449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.  ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. 

విద్యార్థులను ఉదయం 9 గంటల నుండే పరీక్షా కేం ద్రాల్లోకి అనుమతిస్తారని, 9.35 తదుపరి అనుమతి ఉండదని విద్యార్థులు నిర్ణీత సమ యం వరకు వేచి ఉండకుండా 30 నిముషాలు. ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరు కోవాలని తెలిపారు.

విద్యార్థులతో పాటు వి ధులు నిర్వహించే సిబ్బందికి  సైతం సెల్ ఫో న్స్, చేతి వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్షా కేంద్రాల్లోకి   అనుమతి లేద ని, నిశిత పరిశీలన తదుపరి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని ఆయన స్పష్టం చేశారు.