calender_icon.png 21 March, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్ ది బెస్ట్! నేటి నుంచి టెన్త్ పరీక్షలు

21-03-2025 01:04:37 AM

హాజరుకానున్న 5.09 లక్షల మంది విద్యార్థులు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్రవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వర కు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఐదు నిమిషాల వరకు విద్యార్థులకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

అంటే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 9.35 గంటల వరకు అనుమతినిస్తారు. ఈ పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 2,58,895 మందికాగా, బాలికలు 2,50,508 మంది ఉన్నారు. సైన్స్ సబ్జెక్టును రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్ బయలాజికల్ సైన్స్‌గా వేర్వేరు రోజుల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2650 మంది చీఫ్ సూపరింటెండెం ట్, 2650 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్‌లతోపాటు 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందు కు ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పా టు చేశారు.

విద్యార్థులకు ఏమైనా సందేశాలు, సమస్యలు తలెత్తితే 040-23230942 నెంబర్‌ను సం ప్రదించాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షలు జరిగే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా ఆదేశాలు జారీచేశారు.

పరీక్ష లను పకడ్బందీగా నిర్వహించేలా చీఫ్ సూపరింటెండెంట్ గదుల్లో సీసీ కెమెరాలు, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఈసారి ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడాన్ని నిషేధిం చారు. విద్యార్థులకు అడిషనల్ పేప ర్లు ఇవ్వకుండా 24 పేజీల బుక్‌లెట్‌ను సమాధానాలు రాసేందుకు ఇస్తున్నారు.