calender_icon.png 9 February, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు మిగిలింది గాడిదగుడ్డే

09-02-2025 01:35:37 AM

మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డే మిగిలిందని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఢిల్లీ ఫలితాలపై శనివారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ.. ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్‌రెడ్డి పాత్ర అమోఘమన్నారు.

ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచా రం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని, ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగంగా నిర్వహించిన కులగణన మీకే బెడిసికొట్టిందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మళ్లీ కులగణన నిర్వహించి, అన్నీ కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోవాలన్నారు.

లేదంటే ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతమవుతా యని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలనూ కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని జోష్యం చెప్పారు.