02-03-2025 01:03:09 AM
నాగర్‌కర్నూల్, మార్చి1 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు సొరంగం(ఎస్‌ఎల్బీసీ) టన్నెల్ ప్రమాదం విషాదాంతమైంది. ఉపా ధి కోసం పొట్ట చేతపట్టుకుని వలస వచ్చిన పొరుగు రాష్ట్రాల కార్మికులు టన్నెల్ ప్రమాదంలో బురదలో కూరుకుపోయి మరణిం చారు. టన్నెల్‌లోని బురద మట్టిలో గల్లంతైన వారి మృతదేహాల ఆనవాళ్లను రెస్క్యూ టీం శనివారం గుర్తించింది.
దీంతో మంత్రు లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి రెస్క్యూ టీంతో సమావేశ మై.. మృతదేహాలను వెలికి తీసేందుకు ఉన్న అవకాశాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను గతంలోనే పూర్తి చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సహాయక బృందాలు కఠోరంగా శ్రమిస్తున్నట్టు తెలిపారు.
అత్యాధునిక సాంకేతికతతో గుర్తింపు
టన్నెల్‌లో గల్లంతైన కార్మికుల జాడ కనిపించక పోవడంతో బురదలోనే కూరుకుపో యి ఉంటారని రెస్క్యూ బృందం భావించింది. ఈక్రమంలోనే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్), నీటి లోపల వరకూ స్కానింగ్ చేయగలిగే సాంకేతికతను ఉపయోగించి ఆరు మీటర్ల లోతుల్లో మానవ అవక్షేపాలు ఉన్నట్టు నిపుణుల సహాయంతో గుర్తించి ఐదు చోట్ల మార్కింగ్ చేశారు.
అలాగే 7 మీటర్ల లోపల మూడు మృతదేహాలు ఉన్నట్టుగా మానవ అవశేషాలు ఉన్నట్టు స్కానింగ్‌లో వెల్లడైంది. వాటిని పరిశీలించిన సహాయక బృందాలు.. అవి గల్లంతైన వారి మృతదేహాలేనని నిర్ధారించాయి. ప్రమాదం జరిగి 8రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ ఆధారంగా మృతదేహాలను గుర్తించేందుకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం టన్నెల్ వద్దకు చేరుకుంది. మృతదేహాల వెలికితీత తర్వాత నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో వాటికి పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు.
మృతదేహాల వెలికితీత సవాలే..
టన్నెల్ ప్రమాదంలో మొత్తం 8 మంది గల్లంతవ్వగా నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు రెస్క్యూ టీం ప్రాథమికంగా ప్రకటించింది. మరో నాలుగు మృతదేహాలు టన్నెల్‌లోని బోరింగ్ మిషన్‌కు ఆను కుని ఉండొచ్చని భావిస్తూ.. టీబీఎంను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా ఊట నీరు, బురద వస్తుండటంతో వాటిని తొలగించేందుకు రెస్క్యూ టీం తీ వ్రంగా శ్రమిస్తోంది.
ఆరు మీటర్ల కింది భా గంలో గుర్తించిన నాలుగు మృతదేహాలను, మరో 7-8 మీటర్ల కింది భాగంలో గుర్తించిన మరో నాలుగు మృతదేహాలను బయ టకు తీసుకురావాలంటే టన్నెల్‌లోని బురదను పూర్తి స్థాయిలో తొలగించాల్సి ఉం టుంది. కానీ లోకో ట్రైన్ సౌకర్యం 12 కిలోమీటర్ల వరకే అందుబాటులో ఉండటంతో కన్వేయర్ బెల్ట్ సాయంతో బురదను తొలగిస్తున్నారు.
అయితే కన్వేయర్ బెల్ట్ ద్వారా మిషన్ విడి భాగాలను బయటకు తీయలేని పరిస్థితి. అలాగే ప్రమాద స్థలంలో కూలిన సుమారు నాలుగు టన్నుల బరువున్న నిర్మాణ భాగాలను తొలగించేందుకు కూడా అవకాశం లేకుండా ఉంది.
బురదను తొలగించే క్రమంలో నీటి ఊట ఉధృతికి టన్నెల్ పై భాగం నుంచి మట్టి దిబ్బలు మళ్లీ కూలే అవకాశం ఉంది. దీంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న ప్రాణాలకూ ప్రమాదం పొంచి ఉండటంతో గుర్తించిన మృతదేహాలను బయటకు తీసేందుకు సమయం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం..
టన్నెల్ నిర్మాణంలో భాగస్వాములై ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం వాటిని స్వగ్రామాలకు తరలించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, నిర్మాణ సంస్థ, ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక సాయం అందే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.
గత నెల 22న ప్రమాదం
ఫిబ్రవరి 22న ఉదయం ఎస్‌ల్బీసీ టన్నెల్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ శబ్దాలతో ఊట నీరు, బురద ఉబికి వచ్చింది. ఈ క్రమంలో నిర్మాణ సంస్థలో ఫీల్డ్ ఇంజినీర్లుగా పని చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్(51), శ్రీనివాస్(50)లతో పాటు టీబీఎం మిషన్ ఆపరేటర్లుగా పని చేస్తున్న జమ్ముకశ్మీర్ ప్రాంతానికి చెందిన సన్నీ సింగ్(45), పంజాబ్‌కి చెందిన గురుప్రీత్ సింగ్(40), ఝార్ఖండ్ ప్రాంతానికి చెందిన సందీప్ సాహూ(28), అనూజ్ సాహూ(25), జగ్టాక్సెస్(35), సంతోష్ సాహూ(36) అనే నలుగురు కార్మికులు గల్లంతయ్యారు.
దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం సహాయక చర్యలకు ఆదేశించింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం, ఇండియన్ ఆర్మీ వంటి సహాయ బృందాలను అప్రమత్తం చేసింది. హైడ్రా, ఎల్‌అండ్‌టీ, ఐఐటీ మద్రాస్ టీం, జార్ఖండ్ మైనింగ్ టీం ఇలా 12రకాల రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
సుమారు 600 మంది నాలుగు షిఫ్టుల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా స్థానిక ఎమ్మెల్యేలు దగ్గరుండి ఎప్పటికప్పుడు సహాయ చర్యలను పరిశీలించారు.