బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లుశ్రీనివాస్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): గురుకులా లు, హాస్టళ్లలో వరుసగా ఫుడ్‌పాయిజన్ ఘటనలు, పలుచోట్ల విద్యార్థు ల ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు. అవన్నీ ప్రభుత్వ హ త్యలేనని మండిపడ్డారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను ముట్టడించి మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ ఏర్పడినాక 52 మంది విద్యార్థులు మృ తిచెందినా ప్రభుత్వం స్పందించట్లేదని నిప్పులు చెరిగారు.