13-02-2025 07:11:14 PM
పేపర్ లెస్ కంపెనీగా సింగరేణి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆన్లైన్ ద్వారానే జరపాలని గురువారం అవగాహన సదస్సును, కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం శాలెం రాజు మాట్లాడుతూ... మొదటి విడతగా గత నెల 27.01.2025న కొత్తగూడెం ఏరియాలోని అన్ని విభాగాధిపతులకు అవగాహన కల్పించామని, రెండో విడతగా కొత్తగూడెం ఏరియాలోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్స్ & ఓసీలలో పనిచేస్తున్న అధికారులకు, క్లారికల్ సంబంధిత ఉద్యోగస్తులకు గురువారం రోజున ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమం కొత్తగూడెం ఏరియా ఐటి మేనేజర్ శేషశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సింగరేణి నందు ఇప్పటివరకు ఉత్తర ప్రత్యుత్తరాలు, సర్కులర్లు, నోట్ ఫైల్ అప్రోవాల్స్ కాగితంపై జరుగుతున్నాయన్నారు. ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా ఫైర్ డిస్పాచ్ లో సమయం వృధా కాదని తెలియజేశారు. ఏప్రిల్ ఫస్ట్ నుంచి సింగరేణి వ్యాప్తంగా అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫైల్ శాప్ ద్వారా జరుగుతాయని తద్వారా కాగితం వాడకం పూర్తిగా తగ్గుతుందని, భవిష్యత్తులో అవసరమైనప్పుడు తిరిగి వినియోగించుకునే అవకాశం ఈ పద్ధతిలో ఉంటుందని, సమాచారం శాప్ లో భద్రంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ మేనేజర్ కే.శేషశ్రీ తో పాటు కార్పొరేట్ ఐటి డిపార్ట్మెంట్ రమ్య, కొత్తగూడెం ఏరియాలోని అధికారులు కలవల చంద్రశేఖర్, శ్యాం ప్రసాద్, జి సంఘమిత్ర, హరీష్ గోవర్ధన్, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.