కాప్రా: అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హాబ్సిగూడ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత, అణగారినవర్గాల హక్కులకోసం, సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, మహిళా హక్కుల కోసం పదవిని త్యాగం చేసిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు. అంబేద్కర్ చేసిన కృషిని సేవలను కొనియాడుతూ విద్య, రాజకీయ అంశాలు అభివృద్ధికి రెండు చిహ్నాలు అని గుర్తించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ అని అతని యొక్క ఆశయాలను సాధించడములో ముందుండి దేశ భవిష్యత్తులో ప్రతి ఒక్కరు మమేకం అయినప్పుడే అంబేడ్కర్ కి నిజమైన నివాళి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, కంచర్ల సోమిరెడ్డి, లక్ష్మీనారాయణ, సుక్క కిరణ్, యాదగిరి, కైలాసపతి, మనోహర్, వీరేందర్, సంజయ్ జైన్, దినేష్ చెట్టుకూరి, నాని, మెహబూబి, నరేందర్ రాజు, చంద్రశేఖర్, కాలేరు నవీన్, యాకాంత్ తదితరులు పాల్గొన్నారు.