27-02-2025 12:00:00 AM
అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) ః జిల్లాలో గురువారం జరగను న్న ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ లో అరత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కొత్తగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు అందరూ ప్రశాంతమైన వాతావరణం లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
ఓటు హక్కు కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు తమ ఓటు హక్కు ను విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంట ల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఏడు రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి రూటుకి ఒక సెక్టార్ అధికారి, ఒక రూట్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందన్నారు. పిఓలు ,ఏపీవోలకు పోలింగ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
ఓటర్లు ఎమ్మె ల్సీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఉండవు. బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉం టుంది. బ్యాలెట్ పేపర్ పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫొటో ఉంటాయి.ప్రాధాన్య క్రమంలో ఓటరుకు నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో “1” నెంబరు వేయా లి. ఎన్నికల. అధికారులు ఇచ్చిన వాయిలెట్ పెన్నుతో మాత్రమే వేయాలి అని సూచించారు. ఓటర్లు ఎన్నికల సంఘం అనుమ తించిన ఏదేని గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. ఓటర్లకు వారి యొక్క క్రమ సంఖ్య వివరాలు తెలిసే విధంగా పోలింగ్ కేంద్ర వద్ద ఓటర్ రికగ్నుజేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎలక్షన్ సూపర్డెంట్ దారా ప్రసాద్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పోలింగ్ విధులను పకడ్బందీగా చేపట్టాలి : అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను సిబ్బంది పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అప్పజెప్పాలని సూచించారు.
పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ, ఒకటికి రెండు సార్లు పోలింగ్ సామగ్రి సరిచూసుకొని తీసుకొని వెళ్ళాలని, ఎన్నికల నియమ, నిబంధ నలను తూచా తప్పకుండా పాటిస్తూ పోలిం గ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం ఖమ్మం జిల్లాలో 24 పోలిం గ్ కేంద్రాలను సిద్ధం చేశామని, మొత్తం 4089 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేం దుకు 9 సెక్టార్ అధికారులు, 28 ప్రిసైడింగ్ అధికారులు, 27 అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు, 58 ఇతర పోలింగ్ సిబ్బంది , 28 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు, 8 రూట్లలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది, సామాగ్రిని తరలిస్తున్నామని, వీటి కోసం 8 ఆర్టీసీ బస్సులను సన్నద్ధం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఎన్. అరుణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, అధికారులు పాల్గొన్నారు.