ఫుట్‌బాల్ పునర్ వైభవానికే టోర్నీ
ఏర్పాట్లు పూర్తి చేసిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
హైదరాబాద్, విజయక్రాంతి: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) సంయుక్తంగా ఇంటర్‌కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్ 2024 నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాయి. గచ్చిబౌలిలోని GMC బాలయోగి స్టేడియం వేదికగా ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మూడు దేశాలు భారతదేశం, మారిషస్, సిరియా పాల్గొననున్నాయి. ఈ టోర్నీ విజయవంతానికి ఏఐఎఫ్‌ఎఫ్ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరగా.. ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు.