calender_icon.png 15 November, 2024 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నిరకాల సేవలు ఒకేచోట

05-11-2024 12:00:00 AM

త్వరలో రైల్వేసూపర్ యాప్!

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. రైల్వేకు  సంబంధించి అన్నిరకాల సేవలను ఒకేచోట అందించే ఓ సూపర్ యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. డిసెంబర్ చివరికి దీన్ని తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం రైల్వేకు సంబంధించి వివిధ సేవల కోసం వేర్వేరు యాప్స్, వ్బుసైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, అన్ రిజర్వుడు టికెట్ల కోసం యూటీఎస్ యాప్, ఫుడ్ ఆర్డర్ కోసం ఐఆర్సీటీసీ ఈ కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ కోసం రైల్ మదద్ వంటి యాప్స్ ఉన్నాయి.

ఇదికాకుండా రైల్వే ప్రయాణ స్థితిని తెలుసుకోవ డానికి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఉంది. ఇలా వేర్వేరుగా ఉన్న సేవలన్నీ ఈ సూపర్ యాప్ ద్వారా ఒకచోట చేర్చనున్నారు.రైల్వేకు సంబంధించిన సూపర్ యాప్‌నుసెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్‌ఐఎస్) అభివృద్ధి చేస్తోంది.

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్సీటీసీ )తో దీన్ని అనుసంధానం చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగు తోందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ఆంగ్ల మీడియాకు వెల్లడించారు.

ఈ యాప్ అందుబాటులోకి వస్తే ట్రైన్ టికెట్ బుకింగ్‌తోపాటు ప్లాట్‌ఫామ్ టికెట్, అన్ రిజర్వుడ్ టికెట్లనూ ఒకేచోట బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ రన్నింగ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం దీనికోసం చాలామంది థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడుతున్నారు.