22-04-2025 12:57:30 AM
మూసాపేట ఏప్రిల్ 21 : మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం ద్వారా భూ వి వాదాలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని రైతుల భూ ములకు పూర్తి భరోసా లభిస్తుందని, రైతుల భూ సమస్యలు శాశ్వతంగా తీరుతాయన్నారు.
ఇకపై గ్రామాల్లో భూ పంచాయితీలు వివాదాలు ఉండవని అన్నారు.భూములకు సంబం ధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భా రతి చట్టం పోర్టల్ తెచ్చామని, భూ భారతిపై ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.రైతులను మో సం చేయడానికే గత బీఆర్‌ఎస్ సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చిందని, పేదలకు ఇచ్చిన భూములను సైతం ధరణి పేరుతో కొల్ల గొట్టిందని ఆరోపించారు.
ధరణి పేరుతో రైతులను సామాన్యులను కోర్టుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చె ప్పులు అరిగేదాకా తిప్పిందని 20 లక్షల ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కున్నారని అన్నారు.సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు.
పేర్లు సర్వే నంబర్లు ఎకరాలు తప్పు పడినా గతంలో కార్యాలయాలు చుట్టూ తిరిగిన పనులు కాలేదని ప్రస్తుతం చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా ఎంఆర్‌ఒ ఆర్డీవో కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు.
భూభారతి కింద భూము ల వివరాలను డిజిటలైజేషన్ చేస్తామని దీంతో భవిష్యత్లో రైతులకు భూ సమస్యలు, వివాదాలు రావన్నారు భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని చెప్పారు. ఈ చట్టం ద్వారా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు, ఈ పోర్ట్ప ప్రతి ఒక్కరు అవగాహన పెంచు కోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవికుమార్, మూసాపేట తహసిల్దార్ రాజు నాయక్,ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీ ఓ అనురాధ, ఆర్ ఐ అరుణ్ కుమార్, మూసాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి శేఖర్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, మండలంలోని వివిధ గ్రామాల సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.