calender_icon.png 2 November, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని ప్రాంతాలవారూ కనెక్ట్ అవుతారు

13-08-2024 12:00:00 AM

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు పారంజిత్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘తంగలాన్’. చియాన్ విక్రమ్ కథనాయకుడిగా నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం విజయవాడలో  ‘తంగలాన్’ చిత్ర ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో విక్రమ్ మాట్లాడుతూ.. ‘తంగలాన్’ మూవీ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం హ్యాపీగా ఉంది.

మంచి సినిమాకు తెలుగు ఆడియెన్స్ ఎంతగా బాగా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు.. నా ‘అపరిచితుడు’ సినిమా దేశంలోనే విజయవాడలో అత్యధిక రోజులు ఆడిందన్నారు. నా ఫేవరేట్ డైరెక్టర్ పా రంజిత్‌తో చేసిన బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ తంగలాన్ మిమ్మల్ని ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తుందని, ఇందులో రెగ్యులర్ కమర్షియల్ ఫైట్లు, పాటలు ఉండవని, భావోద్వేగాలు మెండుగా ఉన్న కథ అని, అన్ని ప్రాంతాల వారికి ఇది కనెక్ట్ అవుతుందన్నారు. నా కెరీర్‌లో చేసిన ది బెస్ట్ రోల్ ‘తంగలాన్’లో ‘ఆరతి’ అనే క్యారెక్టర్ చేశానని హీరోయిన్ మాళవిక మోహనన్ అన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది.