01-04-2025 10:40:31 PM
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
బోథ్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలకు సన్న బియ్యం పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం బోథ్ పట్టణంలోని 5వ రేషన్ షాపులో సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అర్హులైన ప్రజలందరూ విధిగా ఈ సన్న బియ్యంను ఉపయోగించుకోవాలని సూచించారు. సన్న బియ్యాన్ని అర్హులందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, రేషన్ డీలర్లు అందరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు సన్నబియ్యాన్ని అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పిటిసి సంధ్యారాణి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, పలువురు బిఆర్ఎస్ నాయకులు, రెవెన్యూ అధికారులు ప్రజలు ఉన్నారు.