ఎస్సీ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): ఎస్సీ గురుకులాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిని పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్ జీటీఏ అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌కుమార్‌రెడ్డి కోరారు. 317 జీవోకు సం బంధించిన బదిలీలు, హిందీ టీచర్ల పోస్టులు, పార్ట్ టైం టీచర్ల వేతనాల సమస్యలను సొసైటీ కార్యదర్శికి వివరించారు. సానుకూలంగా స్పందిం చిన ఆమె ప్రతిపాదన చేసిన సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్‌జీటీఏ ఉపాధ్యక్షుడు వేణుప్రసాద్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర బాధ్యుడు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.