calender_icon.png 15 January, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పరీక్షలకు సర్వం సిద్ధం

19-07-2024 01:19:27 AM

20, 21 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు 

272 ఎక్స్‌టర్నల్ పోస్టులకు 18,665 మంది పోటీ

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి) : సింగరేణి సంస్థలో 272 ఎక్స్‌టర్నల్ పోస్టుల భర్తీకి ఈ నెల 20, 21వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎండీ ఎన్ బలరామ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా జరగనున్న ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్ష కోసం మొత్తం 18,665 మంది దరఖాస్తు చేసుకోగా వారందరికీ హాల్ టికెట్లను జారీ చేసినట్లు వెల్లడించారు.

అత్యంత పార దర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లను నిర్వహిస్తున్నామని, ఇం దుకోసం హైదరాబాద్ జంట నగరాల్లోని 12 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ సెంట ర్లు చూసుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే హెల్ప్‌డెస్క్ నంబర్ 8744-249992 ను సంప్రదించాలని కోరారు.