calender_icon.png 14 January, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోళ్లంతా సంక్షేమ పథకాలకు అర్హులు

14-01-2025 01:01:04 AM

  1. ఎన్ని లక్షల రేషన్‌కార్డులైనా ఇస్తాం 
  2. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  3. కూసుమంచిలో ఇందిరమ్మ నమూనా ఇల్లు ప్రారంభం

ఖమ్మం, జనవరి 13 (విజయక్రాంతి): కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా పేదోళ్లందరూ ప్రతి సంక్షేమ పథకానికి అర్హులని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇల్లును సోమవారం మంత్రి ప్రారంభించారు.

నమూనా ఇంటిలోకి వెళ్లి నిర్మాణాన్ని, గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మ  ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు అత్యధిక ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. తెలంగాణలో మొదటి విడతగా మొదటి సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల ఇళ్లు ని   దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పారు.

ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం అనేది  నిరంతర ప్రక్రియ అని తెలిపారు. సా  యోగ్యమైన భూములకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని రైతు  అందిస్తామని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఎన్ని లక్షల రేషన్‌కార్డులైనా జారీ చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

అనంతరం దుబ్బతండాలో ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో  పొంగులేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ర   అసిస్టెంట్  కలెక్టర్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.