రోహిణి అలంకారంలో దర్శనం ఇచ్చిన గజ్వేల్ మహంకాళి
ప్రత్యేక పూజలు చేసిన గురు మదనానంద పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి
గజ్వేల్, (విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలోని మహంకాళి అమ్మవారు ఆదివారం భక్తులకు రోహిణి అలంకారంలో దర్శనం ఇచ్చింది. గురు మదనానంద పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఉత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ... శ్రద్ధ భక్తులతో దైవాన్ని పూజిస్తే భక్తుల వెంట ఉండి కాపాడుతారన్నారు. అమ్మ దయ కోసం పరితపించేవారు నిత్యం జగన్మాతను భక్తితో ప్రార్థించాలన్నారు. తోటి మానవులతో ద్వేషం పెంచుకోకుండా ప్రేమాభిమానాలతో మసులుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చాడ నంద బాల శర్మ, భక్తులు పాల్గొన్నారు.