02-04-2025 11:17:19 PM
పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ కె. నరసింహ...
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల జిల్లాలో పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కె. నరసింహ ప్రారంభించారు. బుధవారం మండల పరిధిలోని కలకొవ గ్రామములో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమానికి ఎస్పీ నరసింహ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పోలీసు శాఖను పోలీసు సేవలను అతి చేరువ చేయడం, పౌరులు ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకునేలా చట్టాల గురించి వివరించడం, పోలీసు మీ రక్షణ భద్రత కోసం ఉన్నారు.
అవగాహన లేకుండా చట్టాన్ని ఉల్లంఘించి ఇతరులపై, ఇతరుల ఆస్తులపై దాడులు చేయవద్దు అని తెలపడం, సమాజంలో అవగాహన లోపం వల్ల నేరాలకు పాల్పడి జీవితాలను జైలుపాలు చేసుకోవద్దు అనే విషయాలను వివరించడం. గ్రామాల్లో అలజడి వాతావరణం, సమస్యలు సృష్టించే వారిలో మార్పు తీసుకురావడం, సామాజికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని నిర్మూలించడం కోసం, తద్వారా గ్రామాల్లో శాంతియుత వాతావరణం కల్పించి పోలీసు సేవలు అందించడం ఈ పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ఉద్దేశం అన్నారు. దీనికోసం గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను సమర్థవంతంగా పని చేపిస్తాము. ఏ వ్యక్తి పైన అయినా ఒకసారి రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్ లాంటిది నమోదైతే జీవితాంతం ఆ మచ్చ అలాగే ఉంటుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు పాల్పడే చర్యలకు జీవితకాలం జైలుకు వెళ్ళాల్సి వస్తుంది.
మహిళల పట్ల, పిల్లల పట్ల చట్టాలు బలోపేతం చేయబడ్డాయి. రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలి, అజాగ్రత్తగా మద్యం మత్తులో, అధిక వేగం తో, నిర్లక్ష్యంగా వాహనాలు తొలడం వల్ల రోడ్డు ప్రమాదాల జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడి డబ్బు కోగొట్టుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోతుంది. ఇలాంటి అంశాలు వివరించడం కోసం పోలీసు మరింతగా ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం ఉన్నది. చెడు నడవడిక, చెడు ఆలోచ ఉన్నవారిలో మార్పు తేవాలి. ప్రజల రక్షణ భద్రత కోసం పోలీసు ఉన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. గ్రామంలో వర్గాలుగా ఏర్పడి ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటే గ్రామం అభివృద్ధి చెందదు.
మన గ్రామ వాతావరణం మన పిల్లల, యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. సమస్యాత్మక గ్రామంగా పోలీసు రికార్డ్ లలో ఒకసారి నమోదైతే పేరు ఎప్పటికీ అలాగే నిలిచి పోతుంది.పెద్దలను చూసి యువత అదే మార్గంలో నడుస్తుంది. సమస్యలు సృష్టిస్తారు, గొడవలు పాల్పడతారు అని ఒక వ్యక్తిపై రౌడీ షీటర్, సస్పెక్ట్ షిటర్ గా పోలీసు రికార్డ్ లో నమోదైతే జీవితకాలం ముద్ర అలాగే ఉంటుంది.ఎలాంటి అల్లర్లు జరిగిన, ఎన్నికల సమయం వచ్చిన సమస్యలు సృష్టించే వ్యక్తిని ప్రతి సారి బైండోవర్ చేస్తాము. మీ ఇంటికి ఎన్నికల సమయంలో, ఇతర అత్యవసర సమయంలో పోలీసు వారు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు అంటే మీకు చెడు పేరు వస్తుంది. యువత ఒక్కసారి కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విషయంలో, విదేశాలకు వెళ్లే విషయంలో, పాస్ పోర్ట్, విసా పొందే విషయంలో పోలీసు అనుమతులు ఇవ్వబడవు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మహిళలను గౌరవించాలి, మహిళా రక్షణలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి, మహిళలను, పిల్లలను వేదిస్తే కేసులు నమోదు చేసి జీవితకాలం శిక్షలు పడేలా పోలీసు దర్యాప్తు ఉంటుంది. ఉచిత భాహుమతులు, తక్కువ రేటుకు వస్తువులు వస్తాయి, లాటరీ వచ్చినది, తక్కువ వడ్డీ లోన్ లు ఇస్తాము, డబ్బులు కడితే ఉద్యోగం ఇస్తాము, తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం వస్తుంది ఇలాంటివి ఎవరైనా అపరిచితులు ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మెసేజ్ ల ద్వారా తెలిపితే నమ్మి అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకోవద్దు.బెట్టింగ్ ప్రకటనలు నమ్మి డబ్బులు బెట్టింగ్ పెట్టవద్దు, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు.రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, మద్యం తాగి వాహనాలు నడపవద్దు, పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు. గంజాయి లాంటి మాదకద్రవ్యాలు మన గ్రామంలోకి రానివ్వద్దు, ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.పేకాట, బెట్టింగ్ లాంటి, బహిరంగంగా మద్యం తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడవద్దు. వీటిపై పోలీసుకు సమాచారం ఇవ్వాలి. అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణారెడ్డి, మునగాల యస్ఐ ప్రవీణ్ కుమార్, నడిగుడెం యస్ ఐ అజయ్, సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.