రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 13 మినిస్టర్స్ కాలనీలో గల రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గృహంలో ఎన్యూమరేటర్లు మంత్రి గారి కుటుంబ వివరాలను సేకరించి స్టిక్కర్ ఆతకించారు.
మంత్రి ఎన్యూమరేటర్లకు తన కుటుంబ వివరాలను తెలియజేసినారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు అలాగే ఇతర బలహీన వర్గాల అభ్యున్నత్తికై సామజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి అలాగే రాజకీయ అవకాశాలను మెరుగు పరుచుటకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిగా సహకరించి వివరాలను తెలపాలని సూచించారు. ఎన్యుమారేటర్లు సర్వే చేస్తున్నా తీరును జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ స్నేహ శబరిష్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరామ్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, తహసీల్దార్ అనితారెడ్డి, సూపర్ వైజర్ శ్రీకాంత్, ఎన్యూమరేటర్స్ తదితరులు పాల్గొన్నారు.