calender_icon.png 7 April, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

24-03-2025 01:16:33 AM

బాన్సువాడ, మార్చి 23( విజయక్రాంతి): ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆ నల్ల పోచమ్మ తల్లి దీవెనలు లభించాలని కోరుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్స్వాడలో నిర్వహించిన కార్యక్రమంలో 55 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన నల్ల పోచమ్మ కు బోనాల ను సమర్పించి మొక్కినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్  కిరణ్ మై రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొన్నారు.

అనంతరం నిర్వహించిన బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి బోనం ఎత్తుకొని పాల్గొన్నారు. కృష్ణారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ అంజిరెడ్డి ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.