calender_icon.png 28 September, 2024 | 8:48 AM

గంజాయి అరికట్టడంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి

26-09-2024 01:42:13 PM

సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్

బెల్లంపల్లి (విజయ క్రాంతి): గంజాయి ని పూర్తిగా అరికట్టడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్ కోరారు. గురువారం ఉదయం బెల్లంపల్లి మండలంలోని భూదాకలాన్ గ్రామంలో నిర్వహించడం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో మాట్లాడారు. నిషేధిత గంజాయిని సేవించడం, పండించడం, రవాణా చేయడం చేయొద్దన్నారు.

గంజాయి బారిన పడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డయల్ 100, షీ టీమ్స్, గుడుంబా నిర్మూలన, మోటార్ వెహికల్ చట్టం, మూఢనమ్మకాలు, యువత చదువుపై ఆయన గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అంతకుముందు పోలీసు జాగిలంతో గ్రామంలో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు,8 ఆటోలను సీజ్ చేశారు.రూ9550 విలువచేసే మద్యాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ల గురజాల, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐలు రమేష్, మహేందర్ లతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.