calender_icon.png 12 February, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కరానికి 24న అఖిలపక్ష సమావేశం..

12-02-2025 08:06:05 PM

తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం...

ముషీరాబాద్ (విజయక్రాంతి): దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మానిఫెస్టోలో ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చకుండా అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

బుధవారం ఏఐటీయూసీ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి నిరసిస్తూ న్యాయమైన ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కరానికి డిమాండ్ చేస్తూ ఈనెల 15 న హైదరాబాద్ నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నామని, అలాగే ఈనెల 24న ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కరానికి బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ రెండు కార్యక్రమాలకు ఆటో డ్రైవర్లు అందరు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో పి.శ్రీకాంత్(సి.ఐ.టి.యు) ఎంఏ.సలీం, ఎండి.నజీర్(యు.టి.ఏ.డబ్ల్యూ.ఏ), నిరంజన్(బి.ఆర్.టి.యు), వి.ప్రవీణ్(టియుసిఐ), రామ్ రెడ్డి(ఐ.ఎఫ్.టి.యు) సిహెచ్.జంగయ్య, ఎస్.అశోక్, ఎం.శ్రీనివాస్, ఎం.కృష్ణ(ఏఐటీయూసీ) తదితరులు పాల్గొన్నారు.