calender_icon.png 13 March, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్‌పై అఖిలపక్ష భేటీ

13-03-2025 12:58:52 AM

  1. రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ 
  2. త్వరలో తేదీ, వేదిక ఖరారు

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అన్నిపార్టీలు హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి సంయు క్తంగా బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు.

డీలిమిటేషన్‌తో రాష్ట్రానికి ప్రమాదం పొంచిఉందని, దీనిపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని బహిరంగ లేఖలో తెలిపారు. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు.